రాశీఖ‌న్నా బాగా ఎగ్జైట్ అవుతుంద‌ట‌..! ఎందుక‌నో..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 1:11 PM GMT
రాశీఖ‌న్నా బాగా ఎగ్జైట్ అవుతుంద‌ట‌..! ఎందుక‌నో..?

అంద‌చందాల‌తో ఆకట్టుకుని వ‌రుస‌గా అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్న‌ ముద్దుగుమ్మ రాశీఖ‌న్నా. ఈ అమ్మ‌డు తెలుగులో మాట్లాడ‌డ‌మే కాదండోయ్ పాట‌లు కూడా పాడేసింది. తాజాగా రాశీ మ‌రో అడుగు ముందుకేసింది. అది ఏంటంటే... తొలిసారిగా రాశీఖ‌న్నా త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ చెప్పుకుంద‌ట‌. అవును... ఈ విష‌యాన్ని స్వ‌యంగా రాశీఖ‌న్నానే తెలియ‌జేసింది. తొలిసారి తాను డ‌బ్బింగ్ చెప్పుకున్నాన‌ని, ప్రేక్ష‌కుల ఎలా రిసీవ్ చేసుకుంటారోన‌ని ఎగ్జైటడ్‌గా ఉన్నాన‌ని రాశీ తెలియ‌జేసింది.

ఇంత‌కీ ఏ సినిమా అనుకుంటున్నారా..? సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న సినిమాలో కావ‌డం విశేషం. విజయ్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌' సినిమాలో న‌టిస్తున్నారు. ఇందులో విజ‌య్ స‌ర‌స‌న రాశీఖ‌న్నా న‌టిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

మ‌ళ్లీ మ‌ళ్లీ రానిరోజు సినిమా ద‌ర్శ‌కుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డియ‌ర్ కామ్రేడ్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న చిత్ర‌మిది. మ‌రి... ఇప్ప‌టి వ‌ర‌కు న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న‌రాశీ ఖ‌న్నా త‌న మాట‌ల‌తో ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Next Story