వాడికి ఆడ, మగ తేడా లేదు.. ఎవ్వరైనా ఒకే..!

By సుభాష్  Published on  12 Jan 2020 1:45 PM GMT
వాడికి ఆడ, మగ తేడా లేదు.. ఎవ్వరైనా ఒకే..!

ముఖ్యాంశాలు

  • 136 అత్యాచారాలు

  • 48 మంది పురుషులపై లైంగిక దాడి

  • 18 నెలల పాటు కేసు విచారణ

  • జీవిత ఖైదుగా కోర్టు తీర్పు

అతనో పీహెచ్‌డీ పట్టభద్రుడు.. సమాజానికి మంచి చేయాల్సిందిపోయి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఆడ, మగ అనే తేడానే లేదు. కనిపించిన వారిపై లైంగిక దాడికి పాల్పడడమే ఇతని నిత్యకృత్యం. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 159 మందిపై లైంగిక దాడులకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. ఓ దోషికి ఇంగ్లండ్‌ కోర్టు జీవిత ఖైదుగా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ దోషి 136 అత్యాచారాలతో పాటు మొత్తం 159 లైంగిక కేసుల్లో దోషిగా తేలాడు. ఇండోనేసియాకు చెందిన రెయిన్‌ హార్డ్‌ సినగా (36) ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో నివసిస్తున్నాడు. ఈయన ఎన్నో దారుణాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇతని మీద నమోదైన కేసుల విచారణ 18 నెలల పాటు జరిగింది. అయితే ఇతని గుర్తింపును బయటపెట్టవద్దని మీడియాపై కూడా ఆంక్షలు విధించింది కోర్టు. ఆ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. పీహెచ్‌డీ చేసిన ఈ దోషి ఇప్పటికే 2018, 2019లలో కేసుల విచారణ పూర్తయి కొన్ని కేసుల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.

48 మంది పురుషులపై కూడా లైంగిక దాడి

మాంచెస్టర్‌ ప్రాంతంలోని క్లబ్బుల్లో 48 మంది పురుషులను తన ప్లాట్‌కు తీసుకెళ్లి మత్తు పదార్థాలు ఇచ్చి లైంగికంగా వేధించడమే కాకండా వీడియోలు సైతం తీసేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ నిందితుడు 190 మందిని విధించాడని, అందుకు పక్కా ఆధారాలు కూడా ఉన్నాయని పోలీసులు కోర్టుకు తెలిపినట్లు సమాచారం. ఈ వ్యక్తిపై నమోదైన కేసులపై నాలుగు వేరువేరుగా విచారణలు చేపట్టారు.136 అత్యాచారాలు, 8 అత్యాచార యత్నాలు, 14 లైంగిక వేధింపులు, మరో కేసులో జననాంగంపై దాడి చేయడం లాంటి విచారణలో తేలినట్లు తెలుస్తోంది. మొత్తం 48 మంది బాధితులున్నారని తేలింది. ఇక ఫోర్న్‌ వీడియోలు తీసి 22 మంది అమ్మాయిలను కూడా మోసం చేసినట్లు విచారణలో బట్టబయలైంది. కాగా, రెయిన్‌ హార్డ్‌ సినగా బారిన పడ్డవారు 190 మందికిపైనే ఉంటారని, వారిలోచాలా మందిని గుర్తించలేకపోతున్నామని పోలీసులు పేర్కొన్నారు. కాగా, తమ జీవితాలను సర్వనాశనం చేసిన అతన్ని జీవితాంతం జైలు నుంచి బయటకు రాకుండా చేయాలని బాధితులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. బ్రిటిష్‌ న్యాయ చరిత్రలోనే ప్రపంచంలోనే అత్యధిక నేరాలకు పాల్పడిన రెపిస్టు ఇతడే అంటూ ప్రాసిక్యూటర్‌ జడ్జి ముందు తెలిపారు.

Next Story