మైనర్ బాలిక పై యువకుడి అత్యాచారం.. అరెస్టు
By Newsmeter.Network Published on 19 Jan 2020 10:58 AM ISTవికారాబాద్ : మహిళల పై అఘాయిత్యాలు ఆగడం లేదు. అత్యాచార దోషులకు కఠిన శిక్షలు విధిస్తున్నా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా పరిగిలోపి బీసీ కాలనీలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలిక(10) పై సాయి (24) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు మాయమాటలు చెప్పి ఊరి చివరకు తీసుకువెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఏం జరిగిందని ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కాలనీవాసులు యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. నిందితునికి కఠిన శిక్ష విధించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
Next Story