అత్యాచారం చేస్తే ఏయే దేశాల్లో ఎలాంటి శిక్షలు వేస్తారంటే...!

By Newsmeter.Network  Published on  5 Dec 2019 6:46 AM GMT
అత్యాచారం చేస్తే ఏయే దేశాల్లో ఎలాంటి శిక్షలు వేస్తారంటే...!

దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు మార్చినా, ఎలాంటి చర్యలు తీసుకున్నా... ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలి అత్యాచారం, హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యాచారం, హత్య ఘటనలకు మనదేశంలోశిక్షలు పెద్దగా లేకపోయినా... ప్రపంచంలో వివిధ దేశాలు పలు రకాల శిక్షలను అమలు చేస్తున్నాయి. ఏయే దేశాల్లో ఎలాంటి శిక్షలు అమల్లో ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం.

 • భారత్‌లో రేప్ కేసుకు సంబంధించి వివిధ రకాల శిక్షలు పడతాయి. 14 ఏళ్ల నుంచి జీవితఖైదు పడొచ్చు. కేసు తీవ్రతను బట్టి ఉరిశిక్ష కూడా పడుతుంది.
 • ఫ్రాన్స్‌లో 15 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల వరకు జైలు శిక్ష
 • ఉత్తరకొరియాలో అత్యాచారం దోషులను కాల్చి చంపుతారు.
 • అఫ్ఘనిస్తాన్ తల మీద కాల్చిచంపుతారు. లేకపోతే ఉరిశిక్ష వేస్తారు.
 • చైనాలో మరణ శిక్ష వేస్తారు. కొన్ని సందర్భాల్లో పురుషాంగం కోసేస్తారు.
 • సౌదీ అరేబియాలో అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయిన కొన్ని రోజుల్లోనే బహిరంగంగా నిందితులను తల నరుకుతారు.
 • ఇరాన్‌లో ఉరిశిక్షను విధిస్తారు
 • ఈజిప్ట్‌లో ఉరిశిక్షను అమలు చేస్తారు.
 • ఇజ్రాయెల్‌లో 16 సంవత్సరాలపాటు జైలు శిక్ష విధిస్తారు.
 • అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానంగా శిక్ష అమలు చేస్తారు. కొన్నేళ్లు జైలు శిక్ష, లేకపోతే జీవితకాల శిక్ష విధిస్తారు.
 • రష్యాలో మూడేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.

Next Story