ముగ్గురు దుండగులు 11 ఏళ్ళ బాలిక పై అత్యాచారం చేసిన ఘటనా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే ఆలీనగర్ లోని రంగుల పరిశ్రమలో పని చేస్తున్న వ్యక్తి  పాతబస్తీ బండ్ల గూడా ప్రాంతంలో ఉంటున్నాడు. ఈ నేల 13 న తనతో పాటు తన కూతురిని పని వద్దకు తీసుకొని వెళ్ళాడు. అతడు తన పని చేసుకుంటుండాగా.. ఒంటరిగా ఉన్న బాలికను ముగ్గురు నిందితులు మాయ మాటలు చెప్పి పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.

ఈ ఘటన జరిగిన దగ్గరి నుండి బాలిక బాగా భయపడుతూనే ఉండిపోయినదని. మూడు రోజుల వరకు ఎవరితో మాట్లాడలేదని తెలిపారు. ఒక రోజు తన తండ్రి వద్దకు ఏడుస్తూ వచ్చి జరిగి విషయాన్ని తెలిపిందని.. ఈ విషయం తెలియటం తో ఒక్కసారిగా షాక్ కు గురైన బాలిక తండ్రి దగ్గరిలో ఉన్న చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే ఈ ఘటన జరిగిన ప్రదేశం మైలారదేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పి.. కేసు సమాచారని ఆ ప్రాంత పోలీస్ స్టేషన్ కు పంపి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్