11 ఏళ్ళ బాలిక పై గ్యాంగ్ రేప్

By Newsmeter.Network
Published on : 18 Dec 2019 3:34 PM IST

11 ఏళ్ళ బాలిక పై గ్యాంగ్ రేప్

ముగ్గురు దుండగులు 11 ఏళ్ళ బాలిక పై అత్యాచారం చేసిన ఘటనా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే ఆలీనగర్ లోని రంగుల పరిశ్రమలో పని చేస్తున్న వ్యక్తి పాతబస్తీ బండ్ల గూడా ప్రాంతంలో ఉంటున్నాడు. ఈ నేల 13 న తనతో పాటు తన కూతురిని పని వద్దకు తీసుకొని వెళ్ళాడు. అతడు తన పని చేసుకుంటుండాగా.. ఒంటరిగా ఉన్న బాలికను ముగ్గురు నిందితులు మాయ మాటలు చెప్పి పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.

ఈ ఘటన జరిగిన దగ్గరి నుండి బాలిక బాగా భయపడుతూనే ఉండిపోయినదని. మూడు రోజుల వరకు ఎవరితో మాట్లాడలేదని తెలిపారు. ఒక రోజు తన తండ్రి వద్దకు ఏడుస్తూ వచ్చి జరిగి విషయాన్ని తెలిపిందని.. ఈ విషయం తెలియటం తో ఒక్కసారిగా షాక్ కు గురైన బాలిక తండ్రి దగ్గరిలో ఉన్న చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే ఈ ఘటన జరిగిన ప్రదేశం మైలారదేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పి.. కేసు సమాచారని ఆ ప్రాంత పోలీస్ స్టేషన్ కు పంపి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story