సంతోష ఆంజనేయులు సమర్పణలో శ్రీలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై.. రాజ్, షాలు హీరోహీరోయిన్లుగా, ఆది అరవల దర్శకత్వంలో కావాలి రాజు నిర్మించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌ చిత్రం “రణస్థలం”. ఈ చిత్ర ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతుల మీదుగా హైదరాబాడ్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కావలి రాజు, దర్శకుడు ఆది అరవల, సంగీత దర్శకుడు రాజకిరణ్, కెమెరా మెన్ ప్రభాకర్, పబ్లిసిటీ డిజైనర్ సాబీర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పూరి జగన్నాధ్ మాట్లాడుతూ:
” ఆది.. నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాలా ఏళ్లు పని చేశాడు. తను రాజు హీరోగా రణస్థలం మూవీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాని… ఈ టీం మొత్తానికి ఆల్ ద బెస్ట్ అని చెప్పారు.

చిత్ర దర్శకుడు ఆది అరవల మాట్లాడుతూ:
” మా గురువైనా పూరి జగన్నాథ్‌ చేతుల మీదుగా మా సినిమా ట్రైలర్ రిలీజ్ జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సినిమా పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.

చిత్ర నిర్మాత కావాలి రాజు మాట్లాడుతూ:
మా సినిమా ఫస్ట్ లుక్ ను మంచి మనసున్న పూరి జగన్నాథ్ గారు రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా పూరిసార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నని తెలిపారు. అయితే ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.. రిచ్‌గా తెరకెక్కించామన్నారు. వచ్చే నెలలో విడుదలకు అంతా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

రాజ్, షాలు, సత్యంరాజేశ్, ఛత్రపతి శేఖర్, రాగిణి, జబర్దస్త్ అప్పారావు, చిత్రం శ్రీను, మేఘన తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం:రాజకిరణ్, కెమెరా:ప్రభాకర్, ఎడిటర్:ఎమ్ ఆర్ వర్మ, లిరిక్స్:ఎం.రామారావు, ఫైట్స్:డ్రాగన్ ప్రకాష్, వించున్ అంజి, డాన్సు:పాల్ ,విగ్నేష్, ఆర్ట్:సుభాష్ నాని, పీఆర్ఓ: బి.వీరబాబు, నిర్మాత:కావాలి రాజు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఆది అరవల.

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.