మెగా హీరో మూవీలో ర‌మ్య‌కృష్ణ‌.. ఇంత‌కీ ఎవ‌రితో..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Nov 2019 6:28 AM GMT
మెగా హీరో మూవీలో ర‌మ్య‌కృష్ణ‌.. ఇంత‌కీ ఎవ‌రితో..?

అందం, అభిన‌యం.. ఈ రెండూ ఉన్న న‌టీమ‌ణుల్లో మొద‌ట వ‌రుస‌లో ఉంటారు ర‌మ్య‌కృష్ణ‌. క‌థానాయిక‌గా ఎన్నో విజ‌యాలు సాధించిన ర‌మ్య‌కృష్ణ బాహుబ‌లి సినిమాలో శివ‌గామి పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నారు. ప్ర‌స్తుతం రమ్యకృష్ణ ఓ వైపు తెలుగులో.. మ‌రో వైపు త‌మిళ్ లో సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.

ఇటీవ‌ల... అక్కినేని హీరోలు నాగార్జున‌తో సోగ్గాడే చిన్ని నాయ‌నా, చైత‌న్య‌తో శైల‌జారెడ్డి అల్లుడు, అఖిల్ తో హ‌లో సినిమాలో న‌టించిన సంగతి తెలిసిందే. అయితే ర‌మ్య‌కృష్ణ ఇప్పుడు మెగా హీరో సినిమాలో న‌టించ‌నున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఆ మెగా హీరో ఎవ‌రంటే... వ‌రుణ్ తేజ్ అని స‌మాచారం. వ‌రుణ్ తేజ్ తో సైరా డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అలాగే కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ ఓ సినిమా చేయ‌నున్నాడు.

అయితే... ఈ ఇద్ద‌రి ద‌ర్శ‌కుల్లో ఎవ‌రి సినిమాలో న‌టించేందుకు ర‌మ్య‌కృష్ణ‌ని సంప్ర‌దించారు అనేది తెలియాల్సివుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.

Next Story