రాంగోపాల్ వర్మ తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై అందిస్తున్న తాజా సంచలన చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. రాంగోపాల్ వర్మతో కలసి సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు రివైజింగ్ కమిటీలో పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 12న చిత్రాన్నిప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

ఈ సందర్బంగా సెన్సార్ రివైజింగ్ కమిటీకి చిత్రబృందం ధన్యవాదాలు తెలిపింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నఈ చిత్రం ట్రైలర్స్ కు, సాంగ్స్ కు,విశేషమైన ఆదరణ లభించిన విషయం తెలిసిందేనని తెలిపింది. ఏ వర్గాలను టార్గెట్ చేసి ఈ చిత్రం చేయలేదని …ప్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపధ్యాల‌తో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిదని స్పష్టం చేసింది.

ఇందులోని పాటలు ఏ పాటకు ఆ పాట హైలైట్ గా ఉంటుందని వివరించింది. ఈ వివాద‌స్ప‌ద చిత్రం సెన్సార్ అడ్డంకులును తొల‌గించుకోవ‌డం విశేషం. మ‌రి.. ఈ సంచ‌ల‌న చిత్రం ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో..?  ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో..?  చూడాలి.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.