ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఎంట్రీ ఎలా ఉంటుందో తెలుసా..?

By Medi Samrat  Published on  12 Oct 2019 8:34 AM GMT
ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఎంట్రీ ఎలా ఉంటుందో తెలుసా..?

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. ఈ సంచ‌ల‌న చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత దాన‌య్య నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమ‌రం భీమ్ స్నేహం నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో కొమ‌రంగా తార‌క్‌, అల్లూరిగా చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే.. త‌న సినిమాల్లో క‌థానాయ‌కుల ప‌రిచ‌య స‌న్నివేశాన్ని ఓ స్థాయిలో ఆవిష్క‌రించే జ‌క్క‌న్న‌... ఈ మల్టీస్టార‌ర్ మూవీలో త‌న ఇద్ద‌రు హీరోల‌ను కూడా ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్స్‌లో చాలా వీరోచితంగా చూపించ‌బోతున్నాడ‌ట‌.

కొమ‌రం భీమ్ పాత్ర పోషిస్తున్న య‌న్టీఆర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ విష‌యానికి వ‌స్తే.. పులి ఫైట్‌తో స్క్రీన్ పై మెస్మ‌రైజింగ్ ఎంట్రీ ఉంటుంద‌ని తెలిసింది. ఇక అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చ‌ర‌ణ్... వంద మందితో పోరాడి గెలిచిన వీరుడిలా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని సమాచారం. ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్‌లా ఉండే ఈ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్స్ కోసం భారీ బ‌డ్జెట్‌నే కేటాయించార‌ని వినికిడి.

ఇందులో చ‌ర‌ణ్ స‌ర‌స‌న‌ ఆలియా భ‌ట్ న‌టిస్తుండ‌గా.. కీల‌క పాత్ర‌ల్లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని న‌టిస్తున్నారు. స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీత‌మందిస్తున్నారు. ఈ భారీ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ను 2020 జూలై 30న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు. ఏది ఏమైనా...అటు యంగ్ టైగ‌ర్ ఫ్యాన్స్ కి, మెగా ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఓ పండ‌గే.

Next Story
Share it