చిరుతో కలిసి రామ్ చరణ్ సీఎం జగన్‌ను ఎందుకు కలవలేదు..?!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Oct 2019 3:23 PM IST![చిరుతో కలిసి రామ్ చరణ్ సీఎం జగన్‌ను ఎందుకు కలవలేదు..?! చిరుతో కలిసి రామ్ చరణ్ సీఎం జగన్‌ను ఎందుకు కలవలేదు..?!](https://telugu.newsmeter.in/wp-content/uploads/2019/10/RAMCHARAN.jpg)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని.. మెగాస్టార్ చిరంజీవి ఈరోజు కలిశారు. చిరంజీవి సతీసమేతంగా వెళ్లి జగన్ ఫ్యామిలీతో సమావేశమయ్యారు. అయితే... చిరంజీవితో పాటు తనయుడు రామ్ చరణ్ కూడా వెళతారని ప్రచారం జరిగింది. కాని.. చరణ్ వెళ్లలేదు. ఆంధ్రప్రదేశ్ లో 'సైరా' సినిమాకి స్పెషల్ షోస్ వేసుకోవడానికి సీఎం వైఎస్ జగన్ పర్మిషన్ ఇచ్చారు. అలాగే ..అఖండ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు జగన్‌ను అభినందించారు చిరంజీవి.
అయితే... రామ్ చరణ్ ఎందుకు వెళ్లలేదు అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే... 'సైరా' సినిమాకి నిర్మాత రామ్ చరణే. ఖచ్చితంగా జగన్ ని చరణ్ కలిసి థ్యాంక్స్ చెబుతాడు అనుకున్నారు .కాని.. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఏంటంటే... చరణ్ కూడా ఈ సమావేశానికి వెళితే బాగుంటుంది అనుకున్నప్పటికీ... లాస్ట్ మినిట్ లో వద్దనుకున్నారట.
కారణం ఏంటంటే... రామ్ చరణ్ కి యూత్ మంచి ఫాలోయింగ్ ఉంది. బాబాయ్ పవన్ కళ్యాణ్ ఓ వైపు జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అప్పుడప్పుడు జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో జగన్ ని చరణ్ కలిస్తే.. అది యూత్ పై, జనసేన పార్టీ పై ప్రభావం చూపిస్తుందనే ఉద్దేశ్యంతో వెళ్లలేదట.!. ఇది ఇండస్ట్రీ సర్కిల్ లో ప్రచారంలో ఉన్న మాట.