ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యంగ్ ఎన‌ర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని.. మ‌రో అప్డేట్‌తో తన ఆనందాన్ని త‌న అభిమానుల‌తో షేర్ చేసుకున్నాడు. సినిమా ప్రమోషన్స్‌కు, సినీ ఇండస్ట్రీ దోస్తుల‌కు విషెస్‌ చెప్పుతూ సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ క‌న‌పడే రామ్.. తాజాగా ఓ సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

వారసుడు వచ్చాడని క్యాప్ష‌న్‌తో.. తన నెప్యూ సిద్దాంత్‌ పోతినేనితో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశాడు. ఇదిలావుంటే.. ఇస్మార్ట్‌ శంకర్ సూప‌ర్ హిట్‌తో మంచి జోష్‌లో రామ్‌.. ప్రస్తుతం కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రెడ్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాలో రామ్‌ సరసన నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేస‌వి కానుక‌గా ఈ సినిమా ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.