అందరూ దీపాలు, కొవ్వొత్తులు వెలిగిస్తే.. రాంగోపాల్ వర్మ ఏం వెలిగించాడంటే..?
By తోట వంశీ కుమార్
రామ్‌గోపాల్ వర్మ.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ప్రధాన మంత్రి పిలుపు మేరకు దేశ ప్రజలంతా లైట్ దియా కార్యక్రమాన్ని నిర్వహించారు. కొందరు దీపాలు వెలిగిస్తే మరికొందరు కొవ్వొత్తులు వెలిగించారు. మరికొందరు మొబైల్ టార్చి ఆన్ చేశారు. మరీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసాడో తెలుసా..? అందరిలా కొవ్వొత్తులో, దీపాలు వెలిగిలిస్తే అతను రాంగోపాల్ వర్మ ఎందుకు అవుతాడు.
ఆదివారం రాత్రి 9 గంటలకు రామ్‌గోపాల్ వర్మ సిజర్ లైటర్‌ను వెలిగించి సిగరెట్ కాల్చాడు. ఆ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశాడు. దానికింద.. సిగరెట్ తాగడంపై ప్రభుత్వ హెచ్చరికను పాటించకపోవడం కన్నా కరోనా గురించి ప్రభుత్వ హెచ్చరిలకు పాటించకపోవడం చాలా ప్రమాదకరమని అన్నారు. దీపాల వెలిగించడం లో కూడా సిగరెట్ తో లింక్ పెట్టి ప్రజల మీద సెటైర్ వేశాడు.ఈ వీడియో చూసిన నెటీజన్లు వర్మపై సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు వీడు ఇంతే మారడు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇప్పటికే కరోనాపై వర్మ ఒక సాంగ్ రాసి పాడిన సంగతి తెలిసిందే.