'నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నాకు తెలుసు'
By తోట వంశీ కుమార్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సినీప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. అయితే ఈ రోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియో వస్తుందని అభిమానులందరూ ఆశించారు. కానీ లాక్‌డౌన్ కారణంగా అది సాధ్యపడలేదు. సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్‌కి.. రాజమౌళి, చెర్రీలు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
‘మై డియర్ బ్రదర్ ఎన్టీఆర్ నీకు జన్మదిన శుభాకాంక్షలు. నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నాకు తెలుసు. నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తానని మాటిస్తున్నా. వేడుకలు ముందున్నాయంటూ’ చెర్రీ ట్వీట్ చేశాడు.
‘కెరీర్ ప్రారంభం నుంచి నువ్వు నా ప్రయాణంలో భాగమైనందుకు సంతోషపడుతున్నా.. హ్యాపీ బర్త్ డే డియర్ తారక్. భీమ్ పాత్రకు నీ కంటే ఉత్తమ నటుడు నాకు దొరకలేదు’ అంటూ పోస్ట్ చేశాడు రాజమౌళి.
హ్యాపీ బర్త్ డే బీమ్. నువ్వు కన్న కలలు నిజం కావాలని కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశాడు.
‘హ్యాపీ బర్త్ డే బ్రదర్ తారక్. నువ్వు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. బెస్ట్ విషెస్’ అని మహేష్ బాబు విషెస్ తెలిపారు.