రజనీకాంత్ స్టేట్ మెంట్ - తమిళ రాజకీయాల్లో సెన్సేషన్..!
By Medi Samrat Published on 22 Nov 2019 4:43 PM ISTముఖ్యాంశాలు
- 2021లో తమిళ ప్రజలు అద్భుతం చూస్తారని బిగ్ స్టేట్మెంట్
- రజనీకాంత్ తో కలిసి నడుస్తానన్న కమల్
- ఇంట్రెస్టింగ్ గా మారిన తమిళ రాజకీయం
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రానున్నారని గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. రజనీ మాత్రం తన నిర్ణయాన్ని స్పష్టంగా తెలియచేయలేదు. ఇటీవల కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావడం.. రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ప్రచారం జరగడం తెలిసిందే. దీంతో రజనీ రాజకీయ ప్రవేశం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఇటీవల రజనీకాంత్ మీడియాకు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అది ఏంటంటే... 2021లో తమిళ ప్రజలు అద్భుతం చూస్తారని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కమల్ హాసన్ తో పొత్తు నిర్ణయంపై ఎన్నికల సమయంలో నిర్ణయిస్తామని చెబుతూ.. ప్రజలు పెను మార్పును చూడబోతున్నారని మాట్లాడారు. అలాగే కమల్ తప్పకుండా సక్సెస్ అవుతాడని తమిళ ప్రజలు అద్భుతమైన తీర్పును ఇస్తారని చెప్పడం తమిళ రాజకీయాల్లో సంచలనం అయ్యింది.
దీనిని బట్టి రజనీకాంత్ రాజకీయా జీవితంపై ఒక అడుగు ముందుకు వేసినట్లు అర్ధమవుతోంది. ఇటీవల కమల్ హాసన్ నిర్వహించిన ఒక ఈవెంట్ లో రజనీకాంత్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ తరువాత రజనీ కాంత్ తో కలిసి రాజకీయాల్లో ముందుకు సాగడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కమల్ చెప్పారు. ఇక ఇప్పుడు కమల్ గురించి రజనీ పాజిటివ్ గా స్పందించి... అద్భుతాలు జరగబోతున్నాయని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రచారంలో ఉన్నట్టుగా రాజకీయాల్లో రజనీ, కమల్ ఇద్దరూ కలిసి నడిస్తే.. సంచలనమే. మరి.. ఏం జరగనుందో చూడాలి.