పశ్చిమ తీరం: భారత తీర ప్రాంతాలకు ఉగ్ర ముప్పు ఉందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. భారత్‌లో హింసను సృష్టించేందుకు పక్క దేశం కుట్రలు పన్నుతుందన్నారు. ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యలో ఒక రాత్రి గడిపిన ఆయన..తీర ప్రాంత భద్రతపై సమీక్ష నిర్వహించారు.తీర ప్రాంతాన్ని రక్షించేందుకు నేవీ కృషి చేస్తుందన్నారు. ముంబై తరహాదాడులు జరగడానికి అవకాశంలేదన్నారు. సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదులు ప్రాణాలతో తిరిగి వెళ్లరని రాజ్‌నాథ్ తీవ్రంగా హెచ్చరించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.