2 రోజులు అడవిలోనే.. సూపర్‌స్టార్ రజినీకాంత్
By అంజి Published on 28 Jan 2020 12:11 PM ISTచెన్నై: ప్రముఖ సాహసికుడు బేర్ గ్రిల్స్.. ఈ పేరు ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటికే ఎన్నో సాహసాలను చేసి ప్రపంచ రికార్డులు సృష్టించారు. సాహసానికి బేర్ గ్రిల్స్ కేరాఫ్ అడ్రస్. 2006లో డిస్కవరీ ఛానెల్‌లో అతను మొదలు పెట్టిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో నేటికి నడుస్తూనే ఉంది. భయకంరమైన ప్రాంతాల్లో కూడా బేర్ గ్రిల్స్ సాహసయాత్రలు చేశారు.
కాగా ఇప్పుడు దక్షిణాది అగ్రహీరో సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో కలిసి బేర్ గ్రిల్స్ ప్రోగామ్ చేస్తున్నారు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగామ్ కోసం రజినీకాంత్ బేర్‌గ్రిల్స్‌తో కలిసి కర్నాటకలోని బండిపురా టైగర్ ఫారెస్ట్‌కి వెళ్లారు.
రజినీకాంత్ రెండు రోజుల పాటు ఫారెస్ట్‌లోనే ఉండనున్నారు. రజనీకాంత్‌కు మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు.
గత సంవత్సరం ప్రధాని మోదీతో కలిసి ఉత్తరఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో సహసయాత్ర చేశారు. ఈ షో ప్రపంచ వ్యాప్తంగా టెలికాస్ట్ అయ్యింది.
బేర్‌గ్రిల్స్ ఎలాంటి సదుపాయాలూ, ఆహారం లేకపోయినా లేకపోయిన అడవుల్లో ఎలా బతకాలో ఈ మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో చూపిస్తుంటారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి కూడా బేర్ గ్రిల్స్ సాహసాలు చేశారు.