ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకాలపై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రాజావారు రాణిగారు’. కంటెంట్ ఉన్న సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పాటల వల్ల సోషల్ మీడియాలో ఈ చిత్రానికి మంచి ఆదరణ ఉంది. ఇటీవల జరిగిన సినిమా ప్రివ్యూ చూసిన పలువురు సినీ ప్రముఖులు తమ ప్రశంశలు అందించారు. కాగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ నవంబర్ 29న చిత్రం విడుదల అవుతున్న విషయాన్ని చిత్ర బృందం ప్రకటించారు. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా జయ్ క్రిష్ సంగీతం అందించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.