దేశంలో మాస్కులు తప్పని చేసి చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రం ఇదే
By సుభాష్ Published on 3 Nov 2020 3:07 AM GMTరాజస్థాన్: అసెంబ్లీలో సోమవారం పబ్లిక్‌లో మాస్కులు తప్పనసరి చేస్తూ బిల్‌ను ఆమోదం చేసింది. ప్రైవేటు, పబ్లిక్‌గా ,సోషల్ మడియా, పొలిటికల్ ఈవెంట్స్‌కు హాజరయ్యే వారు తప్పకుండా మాస్కులు ధరించాలని నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కు వ్యతిరేకంగా తీసుకున్న కొత్త చర్యల్లో భాగంగా రాజస్థాన్ మహమ్మారి చట్టం ప్రకారం అసెంబ్లీ కొత్త చట్టం తీసుకువచ్చింది.
యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ రాకముందు వరకూ ఫేస్ మాస్కులు వాడటమే సరైన మార్గమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ తెలిపారు. ఈ మేరకు వాయిస్ ఓట్ల సహకారంతో రాజస్థాన్ మహమ్మారి బిల్‌ను ఆమోదం తెలిపింది. అలాగే జనాలు ఎక్కువగా ఉండే సమయంలో నోరు, ముక్కు పేస్ మాస్కులతో కవర్ చేయకుండా తిరగడంపై నిషేధించింది.
మాస్కులతో కరోనాను అడ్డుకోవచ్చు
ముఖానికి మాస్కు ధరించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా కరోనాను అడ్డుకోవచ్చని, ఎంతో మంది ప్రాణాలు కాపవడచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారని బిల్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కరోనాకు వ్యతిరేకంగా పోరాడేందుకు పబ్లిక్ మాస్కులు తప్పని సరి చేసిన రాష్ట్రాల్లో తొలి రాష్ట్రం రాజస్థాన్ అని అన్నారు. కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడే వ్యాక్సిన్ లాగే మాస్కులు పని చేస్తాయని అన్నారు. ఒక వేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, మాస్కులు ధరించకుండా బయట తిరిగే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.