రాజస్థాన్‌లో ఘోర విషాద ఘటన జరిగింది. బుధవారం ఉదయం పెళ్లి వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మృతి చెందారని సమాచారం. ఈ ఘటన బూండీలోని కోట లాల్‌సాత్‌ మెగా హైవేపై గల బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు వెంటనే ప్రమాద విషయమై అధికారులకు సమాచారం అందించారు.

Rajasthan bus falls into a river

ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కాగా ఈత వచ్చిన వారు తమ ప్రాణాలను రక్షించుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యేక్ష సాక్షులు స్థానిక మీడియాకు చెప్పారు. పెళ్లి వేడుక నిమిత్తం పెళ్లికొడుకు కుటుంబం, తమ బంధువులతో కలిసి కోట నుంచి సవాయ్‌మాధోపూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Rajasthan bus falls into a river R3

 

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.