ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
By సుభాష్ Published on 6 Sept 2020 11:54 AM ISTదేశంలో వరుసగా ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భిల్వారా జిల్లా కేసర్‌పుర సమీపంలో ఓ వ్యాన్ ఎదురుగా వస్తున్న కంటెయినర్‌ను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి జరిగింది. మృతులు కోటా నుంచి భిల్వారాకు వెళ్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతులు ఉమేష్ (42), జామ్నా (43), ముకేష్ (23), అమర్‌చంద్ (31), రాధేశ్యామ్ (55), రాజు (21), శివ్‌లాల్ (40)గా గుర్తించారు. కాగా, మృతుల్లో ఆరుగురు సింగోలి గ్రామానికి చెందిన వారు కాగా, ఒకరు సాలావటియాకు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. తర్వాత పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అతివేగంగా రావడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఇలా ప్రతి రోజు దేశంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ప్రమాదాలు జరుగకుండా ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది.