ఎడారి రాష్ట్రంలో భారీ వానలు..!
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 29 Sept 2019 8:52 PM IST

జైపూర్: రాజస్థాన్ అంటేనే ఎడారి. అక్కడ నాలుగు చినుకులు పడితేనే కథలు..కథలుగా చెప్పుకోవచ్చు. కాని..అక్కడ కూడా సీన్ మారిపోయింది. చినుకులు కాదు..పెద్ద వానలే పడుతున్నాయి. వరదలు వస్తున్నాయి.
రాజస్ధాన్‌లో వర్షాలు ధాటికి ఓ ట్రక్కు కొట్టుకుపోయింది. ట్రక్కులో ఉన్న 12 మంది చిన్నారులు ఉన్నారు. అయితే..సకాలంలో స్థానికులు స్పందించి ట్రక్కును తాళ్లతో కట్టి ఆపారు. చిన్నారులను కూడా రక్షించారు. రాజస్థాన్‌లోని దుంగర్‌పూర్‌లో ఘటన జరిగింది. ఉత్తరాదిన వర్షాలు బాగా కురుస్తున్నాయి. యూపీ, బిహార్‌లో వరదల ధాటికి వంద మందిపైగా చనిపోయారు.
Next Story