వివాదాస్పదంగా మారిన వైద్యాధికారి పనితీరు

By Newsmeter.Network  Published on  5 Jan 2020 4:29 PM IST
వివాదాస్పదంగా మారిన వైద్యాధికారి పనితీరు

రాజన్న సిరిసిల్ల: మున్సిపల్‌ శాఖమంత్రి కేటీఆర్‌ సొంత నియోజవర్గమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారుల పనితీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. జిల్లా వైద్యాఆరోగ్య శాఖ అధికారి తన ప్రతాపాన్ని చూపించుకున్నాడు. అటెండర్‌తో చెప్పులు శుభ్రం చేయించుకున్నాడు. అధికారి చెప్పులు తూడుస్తున్న అటెండర్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం సంచలనం సృష్టిస్తోంది. తంగళ్లపల్లి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడున్న అటెండర్‌తో డీఎమ్‌హెచ్‌వో తన చెప్పులను అటెండర్‌తో తుడిపించుకున్నాడు.

వైద్య ఆరోగ్యశాఖ అధికారి తీరుపై రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే డీఎమ్‌హెచ్‌వోపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. తన చెప్పులపై క్యాండిల్‌ మరకలు పడటంతో తాను తొలగిస్తుంటే, అటెండర్‌ మధ్యలో కలగజేసుకొని చెప్పులను తీసుకొని వెళ్లాడని డీఎమ్‌హెచ్‌వో చంద్రశేఖర్‌ తెలిపాడు. తాను వద్దని వారించిన వినలేదని వివరణ ఇచ్చాడు. అంటెడర్‌ను కించపరిచే స్థాయికి తాను దిగజారలేదని, నా పనులు నేనే చేసుకుంటానని డీఎమ్‌హెచ్‌వో చంద్రశేఖర్‌ తెలిపారు.

Next Story