అవును ధోని మద్దతు ఇచ్చాడు.. వార్నింగ్ ఇచ్చాడు : రైనా
By తోట వంశీ కుమార్ Published on 26 May 2020 4:13 PM GMTఇటీవల మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎట్టకేలకు భారత ఆటగాడు సురేశ్ రైనా స్పందించాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి నుంచి లభించిన మద్దతు ఆతరువాత ఉన్న ధోని, విరాట్ కోహ్లీల నుంచి లభించలేదని యువరాజ్ అన్నాడు. ఇక సురేశ్ రైనా.. ధోనికి అభిమాన ఆటగాడని.. అతడికి ఇచ్చిన అవకాశాలు మరే క్రికెటర్ ఇవ్వలేదని యువీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
యువీ వ్యాఖ్యలను రైనా ఖండించాడు. తాను ధోనికి అభిమాన ఆటగాడిని కాదని, అయితే.. ధోని తనకు మద్దుతుగా నిలిచిన మాట వాస్తవేనని అన్నాడు. తనలో సత్తా ఉంది కాబట్టే ధోని మద్దతు ఇచ్చాడని, అందుకనే ఎక్కువ అవకాశాలు వచ్చాయని అన్నాడు. నాకు ఇచ్చిన అవకాశాలకు తగిన న్యాయం చేశానని ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ తెలిపాడు. ‘‘అవును ఎంఎస్ ధోనీ నాకు మద్దతు ఇచ్చాడు.. ఎందుకంటే నాలో టాలెంట్ ఉందని తనకు తెలుసు. ధోనీకి నాపై నమ్మకం ఉంది. అది సీఎస్‌కేలో అయినా.. టీమ్ ఇండియాలో అయినా అంటూ రైనా చెప్పుకొచ్చాడు.
నేను స్కోర్ చేయని సందర్భాల్లో మహీ నా దగ్గరికి వచ్చిన గట్టిగా వార్నింగ్ ఇచ్చేవాడు. స్కోర్ చేయకుంటే.. కెప్టెన్‌గా కఠిన నిర్ణయం తీసుకుంటానని హెచ్చరించేవాడు. అయితే.. ఓ రెండు అవకాశాలు ఇవ్వు నేనేంటో నిరూపించుకుంటా అని అడిగేవాడిని, ఇక మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఒక్కొసారి 10 ఓవర్లే ఆడాలి.. ఒక్కసారి 30 ఓవర్లు ఆడాలి. మా స్థానం వేరుగా ఉంటుంది. వికెట్లు తీయాలి.. లేదా 15-20 రన్లు కాపాడాలి. మిడిలార్డర్ నాకు ఎప్పుడు సవాలుగానే ఉంటుంది. కానీ, నేను దాన్ని పాజిటివ్‌గా తీసుకున్నానని రైనా తెలిపాడు.
ధోని కెప్టెన్‌గా బాధ్యతల నుంచి వైదొలిగా తరువాతి ఏడాదే సురేశ్ రైనా జట్టులో స్థానం కోల్పోయాడు. పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయిన రైనా ఇంత వరకు జట్టులో మళ్లీ స్థానం దక్కించుకోలేకపోయాడు. ఇక ఐపీఎల్ లో తన ఫామ్‌ను నిరూపించుకుని మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించిన ఈ లైఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ కి కరోనా కారణంగా నిరాశతప్పలేదు.