భారత్ నుండి ఏది కూడా పొందే అర్హత చైనాకు లేదు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Jun 2020 3:35 PM IST
భారత్ నుండి ఏది కూడా పొందే అర్హత చైనాకు లేదు

చైనా మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. భారత్ కు చెందిన భూభాగమైన గాల్వన్ లోయ కోసం చైనా తెగిస్తూ ఉండడం భారతీయులకు సహించడం లేదు. ఎల్.ఏ.సి. వద్ద చోటుచేసుకుంటున్న టెన్షన్స్ ను చూసి చైనా వస్తువుల వాడకాన్ని తగ్గించాలని.. అసలు వాడకూడదంటూ పెద్ద ఎత్తున పిలుపును ఇస్తున్నారు. పలువురు ప్రముఖులు చైనాకు వ్యతిరేకంగా పిలుపును ఇచ్చారు.

భారత్ నుండి ఏది కూడా పొందే అర్హత చైనాకు లేదని ఆయన భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు సురేష్ రైనా వెల్లడించాడు. 20 మంది భారత సైనికుల మరణం పట్ల దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని అన్నాడు సురేష్ రైనా. ప్రభుత్వం చైనాకు గట్టిగా బదులిస్తోందని అన్నాడు సురేష్. ఇక్కడ కూర్చొని మాట్లాడడం తనకు పెద్ద కష్టం కాదని.. కానీ సైనికుల కుటుంబ సభ్యుల గురించి తలుచుకుంటుంటేనే గుండె తరుక్కుపోతోందని అన్నాడు రైనా.

సైనికుల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని.. వారి త్యాగాలను పొగడడానికి తనకు మాటలు రావడం లేదని అన్నాడు రైనా. ఆర్మీ అన్నది ఎంతో దృఢమైనదని.. ప్రతి ఒక్కరికీ తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నాడు రైనా. మొదట కరోనా వైరస్, ఇప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం.. ముందుగానే ప్లాన్ చేసినట్లు అనిపిస్తోందని అనుమానాన్ని వ్యక్తం చేశాడు రైనా. భారత సైనికులు దేన్నైనా ఎదుర్కోగలరని.. తాను సురక్షితంగా ఉన్నానంటే అందుకు కారణం వారేనని అన్నాడు రైనా.

ఐపీఎల్ ను చైనా కు చెందిన వీవో స్పాన్సర్ చేస్తోంది. త్వరలో ఆ కంపెనీని స్పాన్సర్ షిప్ హక్కుల నుండి తొలగించే అవకాశం ఉందని అంటున్నారు. 2022 సంవత్సరం వరకూ సంవత్సరానికి 440 కోట్ల చొప్పున ఒప్పో బిసిసిఐతో ఒప్పందం కుదుర్చుకుంది.

Next Story