హైద్రాబాద్ లో అకాల వర్షం

By అంజి  Published on  2 Dec 2019 4:36 PM GMT
హైద్రాబాద్ లో అకాల వర్షం

చాల రోజుల తరువాత హైద్రాబాద్ వాసులను వర్షం పలకరించింది. చలి కాలంలో వర్షాలు కురవడం తో హైద్రాబాద్ నగరంలోని ప్రధాన కూడలిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వర్షంతో పాటు చల్ల గాలులు వీయటంతో మహా నగరం ఒక్క సారిగా శీతల ప్రాంతాలను తలపించే విధంగా మారిపోయింది. నగరవాసులు ఈ అకాల వర్షాలకు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చలి కాలాల్లో వర్షాలవల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలను జాగ్రత్త గా చూసుకోవాలని వైద్యులు సూచించారు.అదేవిధంగా శ్వాస సంబంధిత వ్యాధులు కూడా త్వరితగతిన సంక్రమించే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.

Next Story