హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం..
By Newsmeter.NetworkPublished on : 31 Dec 2019 12:22 PM IST

మహానగరం హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం నల్లని మబ్బులతో కమ్ముకొంది. మంగళవారం ఉదయం నగరంలోని పలు చోట్ల వర్షం కురిసింది. ఇప్పటికే చలిగాలులతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, దానికి తోడు వర్షం పడడంతో జనం మరింత ఇబ్బందులకు గురవుతున్నారు.
ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా వర్షం పడడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట, ఉప్పల్, జీడిమెట్ల, ఎర్రగడ్డ, బోరబండ, సనత్‌నగర్, ట్యాంక్‌బండ్, కుత్బుల్లాపూర్, తార్నాకలో మోస్తారు వర్షం పడింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత ఎక్కువ కావడంతో చలి మరింత పెరిగే అవకాశాలున్నాయి.
Next Story