భారీ వర్షానికి వణికిపోతున్న హైదరాబాద్‌.. అత్యవసర ఫోన్‌ నంబర్లు ఇవే

By సుభాష్  Published on  14 Oct 2020 5:20 AM GMT
భారీ వర్షానికి వణికిపోతున్న హైదరాబాద్‌.. అత్యవసర ఫోన్‌ నంబర్లు ఇవే

భారీ వర్షానికి భాగ్యనగరం వణికిపోతోంది. నగరమంతా వర్షంతో నిండిపోయింది. పలు ప్రాంతాల్లో ఎన్నో ఇళ్లు కూలిపోయి దాదాపు 12 మంది వరకు దుర్మరణం పాలయ్యారు. నగరంలో భారీ వర్షం కారణంగా పలు వాహనాలు సైతం వరదలో కొట్టుకుపోయాయి. చాలా మంది వరదనీటిలో చిక్కుకుని నానా యాతనకు గురయ్యారు. దీంతో తెలంగాణ రాష్ట్రం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. హైదరాబాద్‌లో మరో మూడు రోజుల పాటు ప్రజలు ఇళ్ల నుంచి ఎవ్వరు కూడా బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవస సమయంలో ఈ కింది ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

అత్యవసర ఫోన్‌ నంబర్లు :

విద్యుత్‌ సమస్య పరిష్కారం కోసం - 1912, 100

విద్యుత్‌ శాఖ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు : 73820 72104, 73820 72106, 73820 71574

అత్యవసర సేవల కోసం - 040-2111 11111

జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ నెంబర్ -90001 13667

జీహెచ్‌ఎంసీ పరిధిలో చెట్ల నరికివేత సిబ్బంది నంబర్‌ -63090 62583

జీహెచ్‌ఎంసీ విద్యుత్‌ శాఖ నెంబర్‌ - 94408 13750

ఎన్డీఆర్‌ఎఫ్‌ నెంబర్‌ - 8333068536

Next Story