కరోనా మహమ్మారితో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో నెలన్నరగా ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. మరీ ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు లాక్‌డౌన్‌ సమయంలో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం లాక్‌డౌన్‌ పొడిగిస్తూనే సండలింపు ఇచ్చింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను శ్రామిక్‌ రైళ్ల ద్వారా తరలించిన ప్రభుత్వం.. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికోసం ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది.

Also Read :రాత్రి 8గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

ఇందుకోసం మొత్తం 15 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మంగళవారం 12 ప్రయాణీకుల రైళ్లను నడిపిం ది. ఇందుకోసం సోమవారం ఉదయం నుంచి బుకింగ్‌లు ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు ఈ రైళ్లకు 40,533 టికెట్లు బుక్‌ అయినట్లు, ఈ టికెట్ల ద్వారా 82,317 మంది ప్రయాణించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ఈ బుకింగ్‌ల ద్వారా రూ. 16,15,63,821 వసూలు అయిందని అధికారులు వెల్లడించారు. బుకింగ్‌ చేసుకున్న టికెట్లను 24గంటల లోపు రద్దు చేసుకోవాలని, ఇలా రద్దు చేసుకుంటే టికెట్‌పై సగం అమౌంట్‌ని తిరిగి ఇవ్వనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Also Read :పట్టాలెక్కిన రైళ్లు.. ఎక్కడెక్కడ నడుస్తాయంటే..

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *