14 ఏళ్లుగా డేటింగ్.. ఆపై నేడే పెళ్లితో ఒక్క‌ట‌య్యారు.!

By Medi Samrat  Published on  20 Oct 2019 10:19 AM GMT
14 ఏళ్లుగా డేటింగ్.. ఆపై నేడే పెళ్లితో ఒక్క‌ట‌య్యారు.!

స్పెయిన్‌ బుల్‌, టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌ ఇంటి తన గర్ల్‌ఫ్రెండ్‌ షిస్కా పెరిల్లోను వివాహం చేసుకున్నాడు. దాదాపు 14 ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్న వీరు.. నేడు పెళ్లితో ఒక్కటయ్యారు. అత్యంత అందమైన దీవిగా చెప్పుకునే స్పెయిన్‌ దీవులు.. మలోర్కాలో వీరిద్దరి వివాహం వైభవంగా జరిగింది. వీరి వివాహ వేడుక‌కు కొద్దిమంది సన్నిహితులు, అతిథులు మాత్ర‌మే హాజరయ్యారు. నాదల్ సోదరి మారిబెల్‌కు షిస్కా చిన్ననాటి స్నేహితురాలు. ఓ వేడుకలో ఆమెను కలిసిన నాదల్.. తమ పరిచయాన్ని ప్రేమగా మలుచుకున్నాడు.

అయితే.. వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలను మాత్రం రఫెల్ నాదల్ ఇంకా మీడియాకు విడుదల చేయలేదు. ఈ పెళ్లికి స్పెయిన్‌ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ఆటగాళ్లు లోపెజ్‌, డేవిడ్‌ ఫెరర్‌లు హాజరయ్యారు. అయితే నాదల్‌ లేవర్‌ కప్‌ టీమ్‌ ఆటగాడు, స్విస్‌ దిగ్గజం రోజర్ ఫెద‌రర్‌ మాత్రం పెళ్లికి హాజరు కాలేదు.

Next Story
Share it