రఘునందన్ రావు పై రాధారమణి సంచలన వ్యాఖ్యలు
By రాణి
బీజేపీ నేత రఘునందన్ పై రాధారమణి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 3వ తేదీన రాధారమణి రఘనందన్ పై ఆర్ సీ పురం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినప్పటికీ..పోలీసులు ఇంతవరకూ అతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ..రఘునందన్ తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఆమెను ట్రాప్ చేయించి అత్యాచారం చేయించాడని ఆరోపించింది రాధారమణి. తనపై జరిగిన దాడులకు సంబంధించిన మెజిస్ర్టేట్ రిపోర్ట్ ను రఘునందన్ దాచి ఉంచాడని ఆరోపించింది.
రఘునందన్ తనను చంపుతానని సవాల్ చేస్తున్నాడని వాపోయింది. పోలీసులు రఘునందన్ వద్దకు రాకుండా రూ.10 లక్షలు లంచం ఇచ్చాడని, ప్రతి కేసులో రఘునందన్ ఒరిజినల్ ఫైల్స్ మాయం చేసి కేసు నీరుగారుస్తున్నాడన్నారు. అమ్మాయిలతో వ్యభిచారం చేయించి ఈ స్థాయికొచ్చాడని విమర్శించింది. రఘునందన్ తనపై ఇంత ఘాతుకానికి పాల్పడినా తనకు ఏపార్టీ సపోర్ట్ చేయడానికి రాలేదని వాపోయింది రాధారమణి. అలాగే బీజేపీకి చెందిన విజయ, లలిత వంటి వాళ్లు తనను సింగపూర్ పంపించి వ్యభిచారం చేయించాలని చూశారని వాపోయింది.
గతంలో కూడా రఘనందన్ రావు పై రాధారమణి ఆరోపణలు చేసినప్పటికీ..అవన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. రఘునందన్ పై కేసులు పెట్టినా స్పందించకపోవడంతో రాధారమణి మరొకసారి మీడియా ముందుకొచ్చింది.