అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అని ఊరికే అన‌రుగా..!

By అంజి  Published on  6 Feb 2020 4:07 AM GMT
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అని ఊరికే అన‌రుగా..!

బుల్లితెర‌, వెండితెర అన్న తేడా లేకుండా మ‌న తార‌లు విజృంభిస్తున్నారు. ఏ చిన్న అవ‌కాశం చిక్కినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా అట్టే అల్లుకుపోతున్నారు. ఒకానొక స‌మ‌యంలో ఎక్క‌డా ఛాన్స్‌లు దొర‌క్క‌, చిన్నా చిత‌క అవ‌కాశాల కోసం వెంప‌ర్లాడుతూ చివ‌ర‌కు డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌పై క‌నిపించే వారు.

కానీ, ఇటీవ‌ల లోకం పోక‌డ చూస్తుంటే కాలం మారిన‌ట్టు ఇట్టే తెలుస్తుంది. స్మాల్ స్ర్కీన్‌, బిగ్ స్ర్కీన్‌ల‌ను మించి డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్ పాతుకుపోయేలా క‌నిపిస్తోంది. ఆ విష‌యానికొస్తే స‌మంత‌, ర‌మ్య‌కృష్ణ వంటి వారు ఇప్ప‌టికే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌పై క‌ర్చీప్ వేసేశారు.

టాలీవుడ్ తార‌లే ఈ మాత్రం స్పీడ్‌ను మెయింటెనెన్స్ చేస్తుంటే ఇక బాలీవుడ్ బామ‌లు ఏ మాత్రం ఉండాలి..?, తామేమీ త‌క్కువ కాదంటూ మ‌న స్టార్స్‌కంటే ముందే ఎంట్రీ ఇచ్చేశారు. మ‌న గ్లోమ‌ర్ స్టార్ ప్రియాంకా చోప్రా అందులో అక్ష‌రాభ్యాసం ఎప్పుడో చేసేసింది. ఈ కోవ‌లో తాజాగా మ‌రో సుంద‌రి వ‌చ్చి చేరింది. బాసూ సూపించు నీ గ్రేసు అంటూ మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి స్టెప్పులేసిన ఈ భామ కాస్త లేటైనా స‌రైన కంటెంట్‌తో డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌పై ఎంట్రీ ఇచ్చింది.

సోష‌ల్ మీడియా హాట్ సెన్షేష‌న్‌గా మారిన లక్ష్మీ రాయ్ వెబ్ సిరీస్ వైపు దృష్టి సారించ‌డంతో ఆమె అభిమానులు ఆనందంతో ఉబ్బి త‌బ్బుబ్బైపోతున్నారు. లుక్స్ ప‌రంగా అన్ని యాంగిల్స్‌లో అద‌ర‌హో అనిపించే ల‌క్ష్మీ రాయ్‌కు వెండి తెర అంత‌గా క‌లిసి రాక‌పోయినా డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్ అయినా క‌లిసి వ‌స్తుంద‌ని కుర్ర‌కారు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

వెబ్ సిరీస్‌లో రికార్డు హిస్ట‌రీని క్రియేట్ చేసిన పాయిజ‌న్ రెండో భాగం అతి త్వ‌ర‌లో ప్ర‌సారం కానుంది. వ‌రుస ఐటెం సాంగ్‌లు చేస్తున్నా మెయిన్ క్యారెక్ట‌ర్ త‌లుపులు త‌ట్ట‌క‌పోవ‌డంతో నిరాశ‌లో ఉన్న మ‌న ర‌త్తాలు ఈ పాయిజ‌న్ వెబ్ సిరీస్ రెండో భాగంలో లీడ్ క్యారెక్ట‌ర్‌ను కొట్టేసింది. ప్రేమ - ప్ర‌తీకారం లైన‌ప్‌తో కొన‌సాగే ఈ స్టోరీ మొద‌టి పార్ట్‌కు ప్రేక్ష‌కుల నుండి అశేష ఆద‌ర‌ణ ల‌భించింది.

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ప్రారంభ‌మైన రెండో పార్ట్ ప్ర‌స్తుతం నిర్మాణ ప‌నుల‌ను పూర్తి చేసుకుంటుంది. ప్రముఖ టెలివిజ‌న్ దిగ్గ‌జం జీ 5 ఛానెల్‌లో ఏప్రిల్ నుండి పాయిజ‌న్ సెకండ్ సిరీస్ ప్ర‌సారం కానుంది. బాలీవుడ్ కుర్ర హీరో అఫ్తాబ్ శివ దాసాని ఈ సిరీస్‌లో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. టైటిల్‌కు త‌గ్గ‌ట్టే బుస‌లు కొడుతూ హీరోతో జ‌త‌క‌ట్టింది మ‌న ర‌త్తాలు. ఏదేమైనా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న సామెత మాదిరి అంద‌చందాలు ఉన్నా కాలం క‌లిసి రాక వెండితెర‌కు దూర‌మైన మ‌న ర‌త్తాల‌ను డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్ అయినా ఆదుకుంటుందో? లేదో? తెలియాలంటే కొన్ని రోజులు కాదు కొన్ని నెల‌లు ఆగాల్సిందే మ‌రీ.

Next Story
Share it