రేటింగ్ 2/5

సుబ్బు వేదుల దర్శకత్వంలో కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రలుగా వచ్చిన సినిమా ‘రాహు’. కాగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తోంది. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా పై ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

బాను(కృతి గార్గ్) ఆరేళ్ళ వయసులోనే తల్లిని కోల్పోయి.. ఆ తరువాత కన్వర్షన్ డిజార్డర్ (రక్తం చూస్తే నాకు కళ్ళు కనిపించవు)తో లైఫ్ ను లీడ్ చేస్తోంది. అయితే తన తండ్రి కమీషనర్ (సుబ్బు వేదుల) నాగరాజు (కాలకేయ ప్రభాకర్)ను అరెస్ట్ చేయడంతో అతను ఎలాగైనా భానును చంపుతానని ఛాలెంజ్ చేస్తాడు. ఇక ఈ మధ్యలో పెరిగి పెద్ద అయిన భాను, శేష్(అభిరామ్ వర్మ,)తో ప్రేమలో పడుతుంది. వాళ్ళ ప్రేమను భాను తండ్రి అంగీకరించినప్పటికీ, వారి పెళ్లికి ఒక సమస్య వస్తోంది. అలాగే భానును ఎవరో కిడ్నాప్ చేయించి చంపుదామని ప్రయత్నం చేస్తారు? ఆ క్రమంలో నాగాజు(కాలకేయ ప్రభాకర్) భానుకి ఎలాంటి సాయం చేశాడు ? ఇంతకీ భానుని చంపుదామనుకుంటున్న వ్యక్తి ఎవరు ? భాను తనకి జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంది ? చివరికి తనను తాను ఎలా కాపాడుకుంది ? అనేదే మిగతా కథ.

నటీనటులు :

ఇక సినిమాలో ప్రధాన పాత్ర భాను పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన శేష్, నాగరాజు లాంటి మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్.. మొత్తానికి భాను తాలూకు పెయిన్.. అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ అండ్ ఎమోషన్ వంటి అంశాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి గార్గ్ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అయితే ఆమెలో హీరోయిన్ మెటీరియల్ లేదు.

ఇక హీరోగా నటించిన అభిరామ్ వర్మ, తన పాత్రలో అద్భుతంగా నటించారు. అలాగే ప్రధాన పాత్రలో నటించిన కాలకేయ ప్రభాకర్ కూడా తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ సినిమాలో సీరియస్ నెస్ తో పాటు ఒక ఇంట్రస్ట్ ను తన ఎక్స్ ప్రెషన్స్ తో మెయింటైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. తండ్రిగా నటించిన సుబ్బు కూడా పర్వాలేదు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు సుబ్బు వేదుల కొన్ని సన్నివేశాల్లో చాల డిటైయిల్డ్ గా పనిచేశారు. కానీ, అంతే డిటైయిల్డ్ గా స్క్రిప్ట్ లో కూడా పనిచేసి ఉంటే సినిమా అవుట్ ఫుట్ మరోలా ఉండేది. అయితే దర్శకుడు రాసుకున్న కాన్సెప్ట్ మరియు స్క్రీన్ ప్లే.. అలాగే కొన్ని క్రైమ్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ సీరియస్ గా సాగడం.. దానికి తోడూ కొన్ని సన్నివేశాల్లో ప్లో కూడా మిస్ అవ్వడంతో అక్కడక్కడ సినిమా బోర్ కొడుతోంది. పైగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించినట్లు అనిపిస్తోంది. ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలను దర్శకుడుచాలా సినిమాటిక్ గా చెప్పాడు.

సినిమాలో కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో చాల బాగుంది. సంగీత దర్శకుడు అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంది. ఎడిటర్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఆయన దర్శకుడు ఏది చెబితే అది కట్ చేసుకుంటూ వెళ్ళిన్నట్లు అనిపిస్తోంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. అయితే ఇలాంటి సినిమాలకు ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ పెంచాల్సి ఉంటుంది.

ప్లస్ పాయింట్స్ :

కృతి అండ్ అభిరామ్ వర్మ, నటన,
ఎమోషనల్ గా సాగే లవ్ స్టోరీ
సాంగ్స్

మైనస్ పాయింట్స్ :

కథాకథనాలు,
స్క్రీన్ ప్లే బోర్ గా సాగడం,
అక్కడక్కడా స్లోగా నడిచే సన్నివేశాలు,
కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవ్వడం.
ఎక్కువగా కొత్త నటీనటులే కావడం,

చివరగా..

సైకిలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ థీమ్ తో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. సినిమా మాత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. సినిమాలో పేలవంగా సాగే స్క్రీన్ ప్లే, బోరింగ్ సీన్స్ ప్రేక్షకుడికి సినిమా పై కలిగే ఆసక్తిని నీరుగారుస్తాయి. మొత్తం మీద ఈ ‘చిత్రం’ ఆకట్టుకోదు. అయితే కన్వర్షన్ డిజార్డర్ అనే కొత్త పాయింట్ ఉంది కాబట్టి, కొత్తధనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా కొంతవరకు పర్వాలేదనిపిస్తోంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.