నిద్రపోయేటప్పుడు సెల్ ఫోన్ పక్కన పెట్టుకుంటే...?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2019 4:13 PM GMTనిద్రపోయేటప్పుడు సెల్ ఫోన్ ను పక్కన పెట్టుకుని చార్జింగ్ పెట్టండం మంచిది కాదంటున్నారు పరిశోధకులు. నిద్రకు ఆటంకమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. సెల్ ఫోన్‌లోని బ్యాటరీకి పరిమితి ఉంటుంది .చార్జింగ్ ఎక్కువైతే అది పేలవచ్చు. అంతేకాదు..చార్జింగ్ పెట్టిన తీగ కూడా కాలిపోయి ప్రాణాల మీదకు రావచ్చని కొత్తగా పరిశోధనలు చేసినవారు హెచ్చరించారు. దీనిపై మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన కారిస్సా బంకే అనేక పరిశోధనలు చేశారు.
ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫర్ సరిగాలేనట్లైతే యూజర్లు షాక్ కు గురై ఆస్పత్రిలో కూడా చేరవచ్చు. దీనికి సంబంధించి కేసు స్టడీలను కూడా బంకే బృందం చాలా చెప్పింది. 19 ఏళ్ల మహిళ మెడ కాలిపోయింది. అంతేకాదు.. ఓ రోగి ఐ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ.. తీగపై అంతే నిద్రపోయాడు. ప్లగ్‌లో పెట్టకపోయినా.. మొబైల్‌కు చార్జింగ్ తీగ కనక్ట్ అయిఉండటంతో ప్రమాదానికి గురయ్యాడు.
చాలా సందర్భల్లో చార్జింగ్ షాక్ కొట్టినప్పుడు చర్మంపై పొరను దెబ్బ తీస్తుంది.దీనికి ఇంట్లోనే అత్యవసర చికిత్స చేయవచ్చు. అయినా ప్రమాదమే. ఒక్కోసారి మొబైల్ ఫోన్ పేలిన తీవ్రత చర్మం రెండో పొరనుకూడా దెబ్బ తీస్తుంది. ఈ గాయాలు బయటకు చాలా పెద్దగా కూడా కనిపిస్తాయి.
బంకే బృందం పరిశోధనలో తేలింది ఏమంటే..మొబైల్ ఫోన్‌తో జాగ్రత్తగా ఉండాలి. నిద్ర పోయే టప్పుడు అసలు పక్కన పెట్టకూడదు. చార్జింగ్ మొబైల్ అసలు బెడ్ పై పెట్టుకోకూడదు. సో...బీ కేర్ ఫుల్.