వైఎస్ జగన్ మాటంటే మాటే - డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Sept 2019 5:24 PM ISTఅమరావతి: గిరిజనుల అభిప్రాయాన్ని గౌరవించి బాక్సైట్ తవ్వకాలు రద్దు చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజును ఆమె గిరిజనుల పండగ దినంగా అభివర్ణించారు. గిరిజనుల సంపదను చంద్రబాబు దోచుకోవాలని చూశాడన్నారు. బాక్సైట్ కోసం చంద్రబాబు గిరిజన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన జీవో 97కు వ్యతిరేకంగా వైఎస్ జగన్ పోరాడారని గుర్తు చేశారు. అప్పుడే బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం అయిన 4 నెలలకే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేశారన్నారు. వైఎస్ జగన్ మీద నమ్మకంతోనే గిరిజనులు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి బ్రహ్మరథం పట్టారని చెప్పారు. గిరిజనులు జీవితంలో వైఎస్ జగన్‌ను మరిచిపోరన్నారు పుష్ప శ్రీవాణి.
Next Story