పుణే: హైదరాబాద్‌లోనే కాదు పుణేలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న రాత్రి హైదరాబాద్‌లో పడినట్లుగానే..ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు పుణేలో కుంభ వృష్టి పడింది. భారీ ఉరుములు, మెరుపులతో పుణేను వాన ముంచెత్తింది . వీధులు నదులయ్యాయి. కార్లే కాదు ..మనుషులు కొట్టుకుపోయారు . ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 18 మంది చనిపోయారు. ఒకామె భర్త ఎదుటే కొట్టుకుపోయింది. కాని ఏం చేయలేని దుస్థితి. లాంగేవాలే కాలనీలో ఉండే సంజయ్ రాణే భార్య కొట్టుకుపోవడంతో ఆ వీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంజయ్ భార్య పేరు జోష్న(40).

Image result for pune rain

Image result for pune rain

 

“ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. చిన్న చినుకులుగా మొదలై భారీ వాన పడింది. అది ఇంకా పెద్దవానైంది. ఇంట్లోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాం. నా భార్య కళ్ల ఎదుటే కొట్టుకుపోయింది. ఆమెను కాపాడలేక పోయాను. తరువాత ఆమె మృతదేహం దగ్గర్లోనే లభ్యమైంది. మాకు 10 ఏళ్ల వరద్ అనే కుమారుడు ఉన్నాడు. వాడు అమ్మలేని బిడ్డ అయ్యాడంటూ” సంజీవ్ రాణే కన్నీటి పర్యంతమయ్యాడు.

Image result for pune rain

Image result for pune rain

కుండపోత విధ్వంసానికి 800పైగా జంతువులు చనిపోయాయి. 2 వేలకు పైగా వాహనాలు కొట్టుకుపోయాయి.

Image result for pune rain

 

Image result for pune rain

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.