పబ్-జీ కోసం తండ్రినే హతమార్చిన ప్రభుద్దుడు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Sep 2019 5:34 AM GMT
పబ్-జీ కోసం తండ్రినే హతమార్చిన ప్రభుద్దుడు

పబ్-జీ ఆట ఆడకుండా తనని అడ్డుకుంటూన్నాడని తండ్రిని ఘాతుకంగా నరికి చంపాడు కర్ణాటక బెలగావి కి చెందిన 21 ఏళ్ళ యువకుడు. బెలగావి లోని కాకాటి గ్రామం రఘువీర్ ది. రఘువీర్ కుంభార్ తన తండ్రి అయిన శంకర్ దెవప్ప కుంభార్(61) ను ఇంట్లోని కత్తితో గొంతు కోసి చంపేశాడు . అంతేకాదు...ఆయన చేయి, కాలు కూడా నరికేశాడు .

రఘువీర్ పాలిటెక్నిక్ విద్యార్ధి, కాని.. పరీక్షలలో మూడు సార్లు తప్పడమే కాకుండా..మాదకద్రవ్యాలు, మొబైల్ గేమ్ వంటి వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ వ్యసనాల కారణంగా తల్లిదండ్రులను ఎంతో ఇబ్బంది పెట్టేవాడు.

పబ్ జీ ఆడేందుకు డబ్బు అడగగా తండ్రి నిరాకరించాడు. దీనితో తీవ్ర ఆవేశానికి లోనైన రఘువీర్ ఇంట్లో విధ్వంసం సృష్టించాడు. పక్కవారి ఇంటి అద్దాలు పగులకొట్టాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రఘువీర్ ను అదుపులోకి తీసుకొని గట్టిగా హెచ్చరించి రాత్రి ఇంటికి పంపించారు.

ఇంటికి వచ్చాక కూడా రఘువీర్ వ్యవహారంలో మార్పు రాలేదు. మరుసటి రోజు అతను మొబైల్ లో అదే ఆట ఆడుతుండగా తండ్రి ఫోను లాక్కుని మందలించాడు. దీనితో రఘువీర్ మళ్లీ అవేశంతో ఊగిపొయాడు. అంతేకాదు..తండ్రిని కత్తితో నరికి చంపాడు.

ఇది కూడా చదవండి:

https://telugu.newsmeter.in/pubg-takes-teenagers-life/

Next Story
Share it