సైకో భర్త..భార్యను చితబాది, వివస్ర్తను చేసి..

By రాణి  Published on  24 Feb 2020 6:00 AM GMT
సైకో భర్త..భార్యను చితబాది, వివస్ర్తను చేసి..

మహిళలపై దారుణాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా..భిక్కనూరులో ఓ భర్త తన భార్యపై పైశాచికంగా ప్రవర్తించిన తీరు సంచలనం రేపింది. భార్యను చితకబాదిన ఆ ప్రబుద్ధుడు..ఆమెను వివస్ర్తను చేసి రోడ్డుపైకి గెంటేశాడు. ఇది చూసిన చుట్టుపక్కలవారు, బంధువులు ఆమెకు దుస్తులివ్వగా..తీవ్ర అవమానాల మధ్య ఆమె నేరుగా స్థానిక పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. భర్త తనపై ప్రవర్తించిన తీరు..తనను అవమానించిన విధానాన్ని పోలీసులకు మొరపెట్టుకుంది. ఆ దుర్మార్గుడి పైశాచికత్వంపై ఫిర్యాదు చేయగా..పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

మైనర్ బాలికపై అత్యాచారం..ప్రేమించలేదని యువతిపై యాసిడ్, కత్తితో దాడులు..పెళ్లాంపై అనుమానంతో చిత్రహింసలు..ఇలా రోజూ ఏదొక మూల ఏదొక సంఘటన వెలుగులోకొస్తూనే ఉంది. ఇలా ఏదొక నేరం జరిగినప్పుడల్లా పోలీసులు కేసులు నమోదు చేయడం..నిందితులను జైలులో పెట్టి మూడుపూటలా తిండి పెట్టడం..ఇది షరా మామూలే గానీ..దిశ కేసు విషయంలో జరిగినట్లే అన్ని కేసుల్లోనూ నేరం చేసిన ప్రతి నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తేనన్న..ఆడపిల్లను తాకాలంటేనే భయం పుడుతుందని అంటున్నారు కొందరు. నిర్భయ కేసు విషయంలో అయితే..నిందితులకు ఇప్పటికీ నాలుగుసార్లు ఉరిశిక్ష విధించేందుకు ఢిల్లీ పటియాలా కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసినప్పటికీ..నిందితులు ఏదొక పిటిషన్ వేస్తూ..ఉరిశిక్షను వాయిదా వేయిస్తున్నారు. ఈసారి మాత్రం మార్చి 3వ తేదీనే నిందితులకు ఉరిశిక్ష వేయాలని పటియాలా కోర్టు సుస్పష్టంగా చెప్పింది. ఇప్పుడైనా నిందితులను ఉరి తీస్తారో లేదో..ఆ సమయం వచ్చేంతవరకూ ఎవరికీ అర్థంకాని పరిస్థితి.

Next Story
Share it