గోవా: పనాజీ నగరంలోని కలాన్‌గుటీ బీచ్ కేంద్రంగా సాగుతున్న వ్యభిచారం రాకెట్ బాగోతాన్ని గోవా క్రైంబ్రాంచ్ పోలీసులు బట్టబయలు చేశారు. కలాన్‌గుటీ బీచ్ లో ఇద్దరు వ్యక్తులు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారని క్రైంబ్రాంచ్ పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం అందింది. దీంతో పోలీసులు మారువేషంలో విటు లా ఓ పోలీసును పంపించగా వ్యభిచారం రాకెట్ బాగోతం వెలుగుచూసింది.

ఆండ్రియా పెరీరా అనే స్వచ్ఛందసంస్థతో కలిసి క్రైంబ్రాంచ్ పోలీసులు వ్యభిచార రాకెట్ బాగోతాన్ని బయటపెట్టారు. మహారాష్ట్ర నుంచి అమ్మాయిలను గోవాకు తీసుకువచ్చి వారితో వ్యభిచారం సాగించారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

అయితే వ్యభిచార రాకెట్ కీలక సూత్రధారులైన అక్షయ్(27), థోఫిక్ (27) లను క్రైంబ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వ్యభిచారిణులను గోవాలోని రాష్ట్ర మహిళల సదనానికి తరలించారు. వ్యభిచారం రాకెట్ బాగోతంపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని గోవా డీఎస్పీ మహేష్ గోవంకర్ ఈ సందర్భంగాద చెప్పారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.