ఓయూ ప్రొఫెసర్‌ కాశీమ్‌.. కస్టడీకి గజ్వేల్‌ కోర్టు అనుమతి

By అంజి  Published on  22 Jan 2020 5:54 AM GMT
ఓయూ ప్రొఫెసర్‌ కాశీమ్‌.. కస్టడీకి గజ్వేల్‌ కోర్టు అనుమతి

సిద్దిపేట: ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్‌ కాశీమ్‌ను గజ్వేల్‌ కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది. కాశీమ్‌ను ఏడు రోజల పాటు కోర్టు పోలీసులకు కస్డడీకి ఇచ్చింది. కాగా సిద్దిపేట సెషన్‌ కోర్టులో కాశీమ్‌ విడుదల కోసం ఇప్పటికే బెయిల్‌ పిటిషన్‌ దాఖలు అయ్యింది. ఇవాళ బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరగనున్నాయి.

సిపిఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర ప్రొఫెషనల్ రెవెల్యుషనరి గా పనిచేస్తూ మావోయిస్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించడం జరిగిందని సిద్ధిపేట పోలీసు కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. ఇతర మావోయిస్టులతో సెంట్రల్ కమిటీ మెంబర్‌లతో సత్సంబంధాలు కొనసాగిస్తూ సెంట్రల్ కమిటీ ఇచ్చే డబ్బులతో తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని పోలీస్‌ కమిషనర్‌ పేర్కొన్నారు.

జనవరి 19వ తేదీన హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నివాసంలో ఓయూ ప్రొఫెసర్‌ చింతకింది కాశీమ్‌ హెబియాస్‌ కార్పస్‌ పిటిషన్‌ పై విచారణ జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు కాశీమ్‌ను చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చైహాన్‌ ముందు గజ్వేల్‌ పోలీసులు హాజరుపర్చారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది రఘునాథ్‌ తన వాదనలు వినిపించారు. కాగా కాశీమ్‌ అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపటి వరకు కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో తదుపరి విచారణ రేపు జరగనుంది.

Next Story
Share it