అంజ‌లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రొడ్యూస‌ర్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Nov 2019 7:56 AM GMT
అంజ‌లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రొడ్యూస‌ర్..!

తెలుగ‌మ్మాయి అంజ‌లి - త‌మిళ అబ్బాయి జై గ‌త కొంత కాలంగా ప్రేమించుకుంటున్నార‌నీ.. త్వ‌ర‌లో పెళ్లి చేసుకోనున్నార‌ని వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత ఏమైందో ఏమో కానీ.. మేము కేవ‌లం స్నేహితులం మాత్ర‌మే.. మా మ‌ధ్య అలాంటిది ఏమీ లేదు అనేశారు. ఇదిలా ఉంటే... ఇప్పుడు కోలీవుడ్ ప్రొడ్యూస‌ర్ నంద‌కుమార్ అంజ‌లి, జై గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ టాలీవుడ్, కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి.

ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే... అంజలిని చెడగొడుతున్నది తమిళ నటుడు జై.. అని నిర్మాత నందకుమార్ చెప్పారు. అంజలి, జై నటీనటులుగా ‘బెలూన్’ అనే చిత్రంలో నటించిన విషయం విదితమే. కాగా ఈ సినిమాకు నందకుమార్ నిర్మాత. ఆ సమయంలో అంజలి, జైకి సంబంధించిన వివాదాస్పద ఘటన గురించి తాజాగా నందకుమార్ మీడియా ద్వారా వెల్లడించి షాక్ ఇచ్చారు. హీరో జై ను చీకొట్టిన నంద‌కుమార్... అంజలి మంచి అమ్మాయి అంటూ ఆకాశానికెత్తేశారు.

‘జై’ ఆమె జీవితంలోకి వచ్చాడో అంజలి చెడిపోయింది. బెలూన్ సినిమా షూటింగ్ సమయంలో జై మాటిమాటికీ షూటింగ్ డిస్టర్బ్ చేసేవాడు. కొడైకెనాల్‌లో అంజలి, జై కోసం ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో సపరేట్‌గా రెండు గదులు బుక్ చేశాం. కానీ అంజలి, జై ఒకే గదిలో ఉండేవారు. దాంతో మరో గదిని క్యాన్సిల్ చేయమని చెప్పాం. ఇందుకు జై ఒప్పుకోలేదు. ఇలా.. జై త‌న‌ని చాలా ఇబ్బందులు పెట్టాడ‌ని నంద‌కుమార్ బ‌య‌ట‌పెట్టాడు. మ‌రి... నంద‌కుమార్ వ్యాఖ్య‌ల పై జై, అంజ‌లి స్పందిస్తారేమో చూడాలి.

Next Story