'మీకు మాత్రమే చెప్తా' మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2019 5:43 AM GMT
మీకు మాత్రమే చెప్తా మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్

కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షమ్మీర్‌ సుల్తాన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్ అనేది ట్యాగ్ లైన్. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం అనసూయ భరద్వాజ్,అవంతిక, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఓ సరికొత్త కామెడీ డ్రామా నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 1న గ్రాండ్‌గా విడుద‌లై మంచి పాజిటీవ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌సాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన స‌క్స‌స్ మీట్ లో…

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ:

'ఈ రోజు మీకు మాత్రమే చెప్తా ఫంటాస్టిక్ సెలెబ్రేషన్ జరుపుకుంటున్నాం. ఈ సెలెబ్రేషన్స్ కి ఫస్ట్ రీజన్ ఏంటంటే మా అందరి కలలు నిజం అయినందుకు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ టీమ్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది. మొదట్లో నాకీ చిత్రసీమలో అసలు నటుడిగా అవకాశం దొరుకుతుందో, లేదో? అనిపించేది. కానీ, ప్రేక్షకుల ప్రేమాభిమానాల వల్ల ఇంతస్థాయికి చేరుకున్నా.ఇప్పుడు నిర్మాతగా సినిమా విడుదల చేసి ఇప్పుడు సక్సెస్ సెలెబ్రేషన్స్ చేస్తున్నాను. నా జీవితంలో చాలా కలలు ఈరోజు నిజం అయ్యాయని తెలిపారు. అలాగే అంతా కొత్తవారు, కొత్త కంటెంట్ అయినా ఇంత మంచి ఓపెనింగ్స్ రావడం హ్యాపీ గా ఉందన్నారు. నినా ఫస్ట్ ప్రొడక్షన్ కి ఇంత ప్రేమ ఇచ్చినందుకు ప్రతీ ఒక్కరికి థాంక్యూ” అని అన్నారు.

దర్శకుడు షమ్మీర్‌ సుల్తాన్‌ మాట్లాడుతూ:

నిన్న ఆడియన్స్ తో కలిసి సినిమా చూశాను . ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నారు. మా ఉద్దేశ్యం కూడా అదే. ఒక జెన్యూన్ స్టోరి టెల్లింగ్ ద్వారా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం. నా లాంటి ఒక కొత్త డైరెక్టర్ కి ఇదొక కంప్లీట్ ఎక్స్పీరియన్స్. మీఅందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు” అని తెలిపారు.

హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ:

మనం ఏదయినా పనిని ప్రేమతో.. ఇష్టం తో సిన్సియర్ గా చేస్తే దానిలోనే దేవుడు ఉంటాడు అని నమ్మేవ్యక్తులం మేము. అలా ఇష్టంతో ప్రేమతో చెన్నై నుండి ఇక్కడికి వచ్చాడు షమ్మీర్‌. అలాగే ఐటీ జాబ్ చేస్తూ ఇండస్ట్రీలోకి వచ్చింది పావని, అనురాగ్ గారు సిఏ చేసి ఇక్కడికి వచ్చారు. అలాగే విజయ్ ఇష్టంతో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. అందుకనే ఇంత అప్రిసియేషన్ వస్తుంది. రెండు గంటలు ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుతున్నారు. విజయ్ ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో నిర్మించాలని కోరుకుంటున్నానని అన్నారు.

Next Story