హైదరాబాద్‌: ఆర్టీసీలో పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఆర్టీసీ జేఏసీ-1 నేత హనుమంత్‌ ముదిరాజు అన్నారు. 48 రోజుల సమ్మె, 29 మంది బలిదానాలు గాలికి వదిలేసి ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమిస్తాం అని చెప్పడం బాధకరమన్నారు. ఆర్టీసీ కార్మికుల త్యాగాలకు న్యాయం కలిగేలా పోరాడుతామన్నారు. గతంలో ఐఆర్‌ 16 శాతం తీసుకున్నప్పుడు.. జేఏసీ నాయకులు మంత్రుల చుట్టు తిరిగి విజయం సాధించారు. మరి ఇప్పడు డిమాండ్‌లు పరిష్కరించడంలో ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదు అంటూ ప్రశ్నించారు.

జేఏసీ నాయకుల కారణంగానే ఆర్టీసీ సమ్మె ఆగంమయిందని హనుమంత్‌ ముందిరాజ్‌ ఆరోపించారు. సీఎంను జేఏసీ-1 నాయకులు కలిసి ఆర్టీసీలోని సమస్యలను వివరిస్తామన్నారు. కొందరు ఆర్టీసీ నాయకుల తీరు కారణంగా సీఎం సీరియస్‌గా ఉన్నారని హనుమంత్‌ ముందిరాజ్‌ చెప్పుకొచ్చారు. అశ్వత్థామరెడ్డి వల్లనే ఆర్టీసీలో సమస్యలు పెరిగాయన్నారు. సీఎంను వేడుకొని ఆర్టీసీ సమస్యలను పరిష్కరించేలా ప్రయత్నం చేద్దామని హనుమంత్‌ ముదిరాజ్‌ పిలుపునిచ్చారు. ప్రధాన డిమాండ్స్‌ను పక్కన పెట్టినప్పుడే జేఏసీ ఓటమి పాలైందని ఆర్టీసీ జేఏసీ-1 కన్వీనర్‌ హనుమంత్‌ ముదిరాజ్‌ అన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.