కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు హై అలర్ట్‌ ప్రకటించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ భారిన పడి 11,576 మంది మృతి చెందగా.. 2, 78, 840 మంది ఈ వైరస్‌ భారిన పడి చికిత్స పొందుతున్నారు. భారత్‌లోనూ ఈవైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే భారత్‌లో 285 కేసులు నమోదయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తుంది. తెలంగాణలో 21 మంది ఈ వైరస్‌ భారిన పడి చికిత్స పొందుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురికి ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. వీరికి ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నారు. భారత్‌లో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు.

దీంతో దేశవ్యాప్తంగా ఆదివారం స్వీయ గృహనిర్బందం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ఓ వీడియో మెస్సేజ్‌ చేశారు. భయం వద్దు.. వైరస్‌ను అంతమొందించేందుకు ప్రతీ ఒక్కరం పోరాడదాం అంటూ ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన హ్యాండ్‌ వాష్‌ ఛాలెంజ్‌లో ఆమె పాల్గొన్నారు. కరోనా వైరస్‌ రాకుండా చేతుల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో ఈ వీడియో మెస్సేజ్‌ ద్వారా చూపించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.