ప్రియాంక  చోప్రా దీపావళి కాంతుల్లో వెలిగిపోతుంది. కుటుంబం మొత్తం దీపావళి వేడుకల్లో మునిగిపోయారు.  నిక్కీ యాంక పేరుతో ట్వీట్ కూడా చేసింది.  దీపావళి వేడుకల్లో..నిక్కీ తరుపు వారే కనిపించారు..తప్పితే ప్రియాంక తరుపు వారు ఎవరూ లేరు..!. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా 2018లో ప్రముఖ అమెరికన్ సింగర్, యాక్టర్ నిక్కీ జోన్స్ ను వివాహమాడింది. పెళ్లి అయిన తరువాత తొలి దీపావళి కావడంతో ఘనంగా జరుపుకున్నారు. అమెరికాలోనే  ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. పెళ్లి అయిన తరువాత కూడా యాక్టింగ్ ను వీడలేదు. ఇద్దరూ షూటింగ్ ల్లో పాల్గొంటూ కెరీర్ ను నిర్మించుకుంటున్నారు. ఇటీవలప్రముఖ యాక్టర్ , దర్శకుడు ఫర్హన్ అక్తర్ తో కలిసి చేసిన మూవీ’ ది స్కై ఈజ్ పింక్’ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచింది. హాలీవుడ్ వెబ్ సిరీస్ క్వాంటి కో తో పాటు ..కొన్ని బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.