కాలువలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Oct 2019 1:04 PM ISTఅమలాపురం : తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే.పెదపూడి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కావేరీ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు ఈ ఉదయం అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని తెలుస్తోంది. సంఘటన స్థలాని చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు .అనంతరం ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించారు. ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమీ జరగకపోవడంతో.. ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ..ట్రావెల్స్ సిబ్బంది మాత్రం ప్రమాదం జరిగిన వెంటనే.. బస్సు నెంబర్ ప్లేట్‌లను కన్పించకుండా మట్టి పూసే ప్రయత్నం చేసినట్లు ప్రయాణికులు ఆరోపించారు.