Fact Check : ప్రైవేట్ లో ఉంచిన ఫోటోలను ఇకపై ఫేస్ బుక్ పబ్లిక్ చేయనుందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Jun 2020 11:25 AM GMT
Fact Check : ప్రైవేట్ లో ఉంచిన ఫోటోలను ఇకపై ఫేస్ బుక్ పబ్లిక్ చేయనుందా..?

ఫేస్ బుక్ అకౌంట్ లో ప్రైవేట్ గా ఉంచిన ఫోటోలు.. ఇకపై పబ్లిక్ అవ్వబోతున్నాయని.. అందరూ చూసే అవకాశం ఉందంటూ ఓ మెసేజీ సోషల్ మీడియాలో వైరల్అవుతోంది. ఇకపై వాటిని కోర్ట్ కేసుల్లో సాక్ష్యాలుగా వాడబోయే అవకాశం ఉందని ఆ వైరల్ అవుతున్న మెసేజీలో చెబుతున్నారు.

“Don’t forget tomorrow starts the new Facebook rule where they can use your photos. Don’t forget the Deadline is today!!! It can be used in court cases in litigation against you. Everything you’ve ever posted becomes public from today – even messages that have been deleted. It costs nothing for a simple copy and paste, better safe than sorry.” అంటూ మెసేజీ వైరల్ అవుతోంది.

ఫేస్ బుక్ లో కొత్త రూల్ మొదలుకాబోతోందని.. ఇకపై మీ ప్రైవేట్ ఫోటోలను ఫేస్ బుక్ పబ్లిక్ చేసే అవకాశం ఉంది. కోర్టు కేసులలో లిటిగేషన్స్ విషయంలో ఇకపై ప్రైవేట్ ఫోటోలను వాడే అవకాశం ఉందని చెబుతూ మెసేజీని వైరల్ చేస్తున్నారు. మెసేజీలు డిలీట్ చేసినప్పటికీ అవి పబ్లిక్ అవుతాయని.. అలా జరగకూడదు అంటూ కింద చెప్పబోయే మెసేజీని కాపీ చేసి.. వారి వారి ఫేస్ బుక్ వాల్స్ లో పోస్టు చేయాలని ఆ మెసేజీలో ఉంది.

“I do not give Facebook or any entities associated with Facebook permission to use my pictures, information, messages or posts, both past, and future. With this statement, I give notice to Facebook that it is strictly forbidden to disclose, copy, distribute, or take any other action against me based on this profile and/or its contents including the personal information contained in my profile. The violation of privacy can be punished by law NOTE: Facebook is now a public entity. All members must post a note like this,” అని పోస్టు చేస్తున్నారు ఫేస్ బుక్ లో..!

ఫేస్ బుక్ కు తాము ఎటువంటి అధికారాలు ఇవ్వడం లేదని అలాకానీ ఫేస్ బుక్ చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఈ మెసేజీలో ఉంది. అలా ఎవరికి వారు తమ తమ అకౌంట్ మీద కాపీ పేస్ట్ చేస్తే ఫేస్ బుక్ ప్రైవేట్ చేయదని చెబుతున్నారు. దీన్ని పలువురు ఫేస్ బుక్ పేజ్ లలో పోస్టు చేస్తున్నారు. ముందుగా జాగ్రత్త పడి కాపీ, పేస్ట్ చేస్తే తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదని చాలామంది పోస్టులు పెడుతున్నారు.

నిజ నిర్ధారణ:

ఈ వైరల్ మెసేజీ చాలా కాలంగా ఫేస్ బుక్ లో వైరల్ అవుతోంది. గత ఏడాది జులైలో Mirror UK ఈ మెసేజీని గాలివార్త అని కొట్టేసింది. ఫేస్ బుక్ టర్మ్స్ అండ్ సర్వీస్ ల ప్రకారం ఫేస్ బుక్ లో స్టోర్ చేసే అవకాశం, కాపీ, షేర్ చేసే వరకూ మాత్రమే ఉంటుంది. అది కూడా ప్రొఫైల్ ఎవరికైతే చూపించాలి అని సెట్టింగ్స్ లో మార్పులు చేసి ఉంటామో.. వాళ్ళే చూడొచ్చు. ఫేస్ బుక్ కు చెందిన ప్రోడక్ట్స్ చూసే అవకాశం ఉంటుంది. ఫేస్ బుక్ నుండి ఎప్పుడైతే డిలీట్ చేస్తామో.. ఆ తర్వాత ఫేస్ బుక్ కు ఎటువంటి అధికారాలు కూడా ఉండవు.

ఫేస్ బుక్ అకౌంట్ ను డీయాక్టివేట్ చేస్తే అప్పుడు ఫేస్ బుక్ మన డీటెయిల్స్ మొత్తాన్ని డిలీట్ చేస్తుంది. ప్రొఫైల్ లో ఎటువంటిది ఉండదు. ఫేస్ బుక్ లో ప్రైవేట్ ఆప్షన్ అన్నది వ్యక్తిగతమైన సౌలభ్యం కోసమే.. అంతే తప్పితే ఇతరులకు కనిపించడం కోసం కాదు. ఫేస్ బుక్ అలాంటి పని ఎప్పటికీ చేయదని సంస్థ ప్రతినిధులు గతంలో కూడా వెల్లడించారు. ఫేస్ బుక్ అకౌంట్ లకు సంబంధించిన ఎటువంటి విషయాన్ని కూడా ఇతరులకు చేరవేయదు. అకౌంట్ పర్మిషన్ ఇస్తే తప్పితే ఇతరులు చూడడానికి వీలు లేదు.

వైరల్ మెసేజీని మీ ఫేస్ బుక్ పేజీ వాల్ మీద పోస్టు చేయడం వలన ఎటువంటి ఉపయోగం లేదు.

Claim Review:Fact Check : ప్రైవేట్ లో ఉంచిన ఫోటోలను ఇకపై ఫేస్ బుక్ పబ్లిక్ చేయనుందా..?
Claim Fact Check:false
Next Story