ముఖ్యాంశాలు

  • రీఎంట్రీ ఇచ్చిన పృథ్వీ షా
  • ముంబై 83 పరుగుల తేడాతో విజ‌యం

ముంబై ఓపెనర్‌ పృథ్వీ షా ప‌వ‌ర్ బ్యాటింగ్‌తో చెల‌రేగాడు. నిషేధిత ఉత్ప్రేరకం వాడి నిషేధానికి గురై ఇటీవల క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చిన పృథ్వీ షా.. సయ్యద్‌ ముస్తాక్‌ ఆలీ టీ20 ట్రోఫీలో భాగంగా ఆదివారం అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో మెరిశాడు. టాస్‌ గెలిచిన అస్సాం ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై ఇన్నింగ్స్ ఆరంభించిన‌ పృథ్వీ షా, ఆదిత్యా తారేలు ధాటిగా ఆడి ముంబై స్కోరును పరుగులు పెట్టించారు.

ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న‌ పృథ్వీషా 39 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్సర్లతో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. పృథ్వీషా 63 పరుగులు చేయగా, ఆదిత్యా తారే 48 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 82 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ముంబై 83 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై 20 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేయగా, అస్సాం నిర్ణీత ఓవ‌ర్ల‌లో 8వికెట్లు కోల్పోయి 123 పరుగులే చేసి ప‌రాజ‌యం పాలైంది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.