9వ తరగతి విద్యార్థినిపై 'ప్రిన్సిపాల్' అఘాయిత్యం.!
By Medi SamratPublished on : 23 Nov 2019 5:24 PM IST

రంగారెడ్డి : విద్యా బుద్దులు చెప్పాల్సిన గురువే కాలకూట విషమై కాటేశాడు. చదువు నేర్సాల్సిన ఉన్నతమైన స్థానంలో ఉండి నీచపు పనికి ఒడిగట్టాడు. తలెత్తుకుని సంఘంలో గౌరవంగా తిరిగే ఉపాధ్యాయ వృత్తికి తీవ్ర కలంకం తెచ్చాడు. వివరాళ్లోకెళితే.. అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగరంలో దారుణం చోటుచేసుకుంది. స్కూల్ ప్రిన్సిపాల్ 9వ తరగతి విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టాడు. వివరాళ్లోకెళితే.. జానెట్ జార్జి మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రసాదరావు(47) అదే స్కూళ్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయమై విద్యార్థిని షీటీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపాల్ ప్రసాదరావు పై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story