రష్మికతో ప్రిన్స్ లిప్ లాక్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 11:24 AM GMT
రష్మికతో ప్రిన్స్ లిప్ లాక్..!

'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సంక్రాంతికి సందడి చేయనున్నారు ప్రిన్స్ మహేశ్ బాబు. హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ సినిమాలో బెంగళూరు బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా....చాలా కాలం గ్యాప్ తర్వాత రాములమ్మ విజయశాంతి వెండితెరపై కనిపించనుంది. ఈ సినిమాను దిల్ రాజుతో పాటు అనిల్ సుంకర, మహేశ్ బాబు కలిపి నిర్మిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. 'ఎఫ్ 2' లాంటి హిట్ తర్వాత మళ్లీ అనిల్ సినిమాకు దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో మాంచి లిప్ లాక్ ఉందట. రష్మిక పెదవులతో మహేశ్ పెదవులు కలబోతున్నాయట. రొమాంటిక్ సాంగ్ లో భాగంగా వీరిద్దరి మధ్య లిప్ లాక్ కన్పించబోతుందట. నిజానికి దీన్ని రివీల్ చేయకుండా సర్ ఫ్రైజ్ గా ఉంచాలని అనిల్ ప్లాన్ చేసినా ....అది ఎలాగొలాగ లీకైంది. ప్రస్తుతం రష్మిక-ప్రిన్స్ లిప్ లాక్ న్యూస్ వైరల్ అవుతుంది. నిజానికి లిప్ లాక్ లు ఇద్దరికీ కొత్తేమీ కాదు. గతంలో మహేశ్ పూరీ కాంబోలో వచ్చిన బిజినెస్ మ్యాన్ చిత్రంలో కాజల్ అగర్వాల్ తో లిప్ లాక్ ఇచ్చాడు. చందమామ అనే సాంగ్ లో కాజల్ అదరాలతో మహేశ్ పెదవులు కలిశాయి. ఇక రష్మికకు కూడా లిప్ లాక్ లు కొత్తేమీ కాదు. గోతగోవిందం సినిమాలో తన పెదవులను విజయ్ పెదవులతో కలిపేసింది. ఇక ఆ తర్వాత డియర్ కామ్రెడ్ లో అయితే ఓ రేంజ్ లో లిప్ లాక్స్ చేసింది. లిప్ లాక్ అంటే ఫ్యాన్స్ కు పండుగే ..... మరి మహేశ్ చేయబోతున్న లిప్ లాక్ పై ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story
Share it